RRR కోసం రూటు మార్చిన రాజమౌళి… వకీల్ సాబ్ కూడా అక్కడే

  • Published By: Chandu 10tv ,Published On : July 13, 2020 / 02:54 PM IST
RRR కోసం రూటు మార్చిన రాజమౌళి… వకీల్ సాబ్ కూడా అక్కడే

టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి రూటు మార్చారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు లో బడ్జెట్ మూవీలను కూడా సెట్స్ మీదే పూర్తి చేసేస్తుంటారు. బాహుబలి లాంటి సినిమాను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే భారీ సెట్ వేసి అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబో మూవీ RRRను అక్కడే తీసేయాలనుకున్నారు.

ఈ లాక్ డౌన్ పుణ్యమా అని షూటింగ్ లు కొద్ది నెలలుగా ఆగిపోవడంతో రూట్ మార్చేశారు. సిటీకి దూరంగా ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి బదులుగా అన్నపూర్ణ స్టూడియోను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే భారీ రేంజిలో సెట్స్ వేసి ముస్తాబు చేస్తున్నారు. ఈ జక్కన్న క్రియేటివిటీతో పాటు కారణాలు లేకుండా ఏ పని చేయడు కదా. ఆ మాస్టర్ మైండ్ ప్లానే వేరబ్బా…

ఈ షూటింగ్ తో బాబాయ్-అబ్బాయ్ ఒకే షూటింగ్ స్పాట్ లో కలవనున్నారన్న మాట. బాలీవుడ్ మూవీ పింక్ సినిమా రీమేక్ అయిన వకీల్ సాబ్ షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతోంది. అంజలి, నివేదా థామస్, అనన్యాలు లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.

Read Here>>‘గున్నా గున్నా మామిడి’’.. ఊపు తగ్గలేదు..