‘ఆర్ఆర్ఆర్’ మేజర్ షెడ్యూల్ పూర్తి

10TV Telugu News

RRR Team wrapped: యంగ్ టైగర్ NTR కొమరం భీం, మెగా పవర్‌స్టార్ Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చూపిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..

లాక్‌డౌన్ త‌ర్వాత పునః ప్రారంభ‌మైన ఈ చిత్ర షూటింగ్ 50 రోజుల భారీ యాక్ష‌న్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌ మొత్తం రాత్రి వేళ‌ల్లో, ఎముకలు కొరికే చలిలో షూట్ చేశారు. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నామని టీం తెలిపారు.

ఈ సినిమాలో ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అజయ్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి హాలీవుడ్, బాలీవుడ్ మరియు కోలీవుడ్ నటీనటుల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దానయ్య నిర్మిస్తున్నారు. సంగీతం : ఎం.ఎం.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్.

×