RRR: అంతా సిద్ధం.. ట్రైలర్ కూడా రెడీ.. ఇక రచ్చ రచ్చే!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది.ఇప్పటికే విడుదల చేసిన లుక్స్..

RRR: అంతా సిద్ధం.. ట్రైలర్ కూడా రెడీ.. ఇక రచ్చ రచ్చే!

RRR

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది.ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొన్న వచ్చిన నాటు నాటు పాటైతే యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తుంది. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులేసి తన ఉత్సాహాన్ని చాటుకుంటే సినిమా ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠ తట్టుకోలేకపోతున్నామని ట్వీట్లు, పోస్టులు పెట్టారు.

Project K: రెబల్ స్టార్‌తో అశ్విన్ సినిమా.. కీలక మార్పులు చేశారా?

కాగా.. ఇప్పుడు అందుతున్న తాజా అప్డేట్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుందట. పాటల నుండి ట్రైలర్ వరకూ అన్నీ సిద్ధం చేసిన రాజమౌళి ఇక ప్రమోషన్ సందడి మొదలు పెట్టనున్నాడట. ఈనెలలో ఒక్కొకటి రిలికల్స్ సాంగ్స్ విడుదల చేయనున్న ఆర్ఆర్ఆర్ టీం డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ వదిలేందుకు ముహూర్తం పెట్టేశారట. డిసెంబర్ 4న ది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల కానుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Sara Ali Khan : సాగరతీరాన సోకులారబోస్తున్న సారా

జనవరి 7న సినిమా విడుదల కానుండగా డిసెంబర్ నుండి నెల రోజుల పాటు సినిమా ప్రమోషన్స్ తో యూనిట్ బిజీ కానుంది. దేశవ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయనున్నారు. ట్రైలర్ కూడా అన్ని బాషలకు తగ్గట్లే.. ఆయా బాషల నటులను హైలెట్ చేసేలా కట్ చేయించిన జక్కన్న బాలీవుడ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు అక్కడ మహా మహులను దింపనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఆ ఘడియలు ఎప్పుడొస్తాయో ఏమో!