RRR Trailer : ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద.. రౌద్రం.. రణం.. రుధిరం..

ట్రైలర్ చూసిన వారికి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ట్రైలర్ లో సినిమాలో ఉండే అన్ని క్యారెక్టర్స్ ని చూపించారు. అంతర్లీనంగా స్టోరీని కూడా చెప్పి చెప్పనట్టు.....

RRR Trailer : ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద.. రౌద్రం.. రణం.. రుధిరం..

Rrr (1)

RRR Trailer :  దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ట్రైలర్ ని కొన్ని నిమిషాల క్రితమే విడుదల చేశారు. రాజమౌళి సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందులోను ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ అంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎదురు చుస్తునారు ప్రేక్షకులు. కరోనా వాళ్ళ చాలా ఆలస్యమైంది ఈ సినిమా. జనవరి 7న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ కు భారీ స్పందన వస్తుంది.

Thiagarajan : స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం.. రోడ్డు మీద అనాధగా మరణం..

ట్రైలర్ చూసిన వారికి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ట్రైలర్ లో సినిమాలో ఉండే అన్ని క్యారెక్టర్స్ ని చూపించారు. అంతర్లీనంగా స్టోరీని కూడా చెప్పి చెప్పనట్టు చెప్పేసారు. ఇక రాజమౌళి టేకింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మన అందరికి తెలిసిందే. ట్రైలర్ లో చూపించిన ప్రతి షాట్ రాజమౌళి గత సినిమాల కంటే కూడా అద్భుతంగా ఉంది. బ్రిటిష్ వాళ్లు గిరిజనుల దగ్గరినుంచి ఒక చిన్న పిల్లని తీసుకెళ్లడం, రాజీవ్ కనకాల బ్రిటిష్ వాళ్లకు ఎన్టీఆర్ గురించి చెప్తూ హెచ్చరించడం, రామ్ చరణ్ ఎన్టీఆర్ స్నేహితులుగా ఎంజాయ్ చేయడం, రామ్ చరణ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా చేరడం, ఎన్టీఆర్ గిరిజనులతో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరగడం, రామ్ చరణ్ ఎన్టీఆర్ ని అరెస్ట్ చేయడం, తర్వాత ఇద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడటం, చివర్లో ఇద్దరు కలిసి చేసే వీరోచిత సన్నివేశాలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‌లో వచ్చేసింది.. అరాచకం అనేది చిన్నపదమే!

బ్రిటిష్ వాళ్ళ పై వీరిద్దరూ కలిసి చేసే పోరాటంలో ప్రతి షాట్ ని అద్భుతంగా చిత్రీకరించారు. ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ అభిమానులని ఆనందపరిచారు రాజమౌళి. ఇక ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో ‘భీం.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద..’ అని ఇద్దరూ కలిసి పోరాడే సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయి. ట్రైలర్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకరిపైకి ఒకరు ఎక్కి గాలిలో ఎగిరి కొట్టే సీన్ తో ట్రైలర్ ని పూర్తి చేశారు. ఈ ఒక్క షాట్ తో రాజమౌళి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ చుసిన తర్వాత కేవలం ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులే కాక సినీ ప్రేక్షకులంతా సినిమా ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతున్నారు.