RRR: మరో ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా నీరాజనాలు పలికారు. ఇటీవల ఈ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో శాటర్న్ అవార్డ్ దక్కింది. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డును అందుకుని ఈ సినిమా తన సత్తా చాటింది.

RRR: మరో ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకున్న ఆర్ఆర్ఆర్..!

RRR Wins Best International Feature In Sunset Circle Awards

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా నీరాజనాలు పలికారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి ఈ సినిమాలో నటించడంతో అభిమానులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక రికార్డును క్రియేట్ చేసుకుంది.

RRR: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ నయా రికార్డ్.. ఏమిటంటే?

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ కాగా, అక్కడ పలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను ఆస్కార్ బరిలో ఇప్పటికే పలు విభాగాల్లో నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో శాటర్న్ అవార్డ్ దక్కింది. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డును అందుకుని ఈ సినిమా తన సత్తా చాటింది. సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో ఈ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ అవార్డును అందుకుంది. మరో నాలుగు ఇంటర్నేషనల్ సినిమాలు కూడా ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి.

RRR : ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్.. గవర్నర్ అవార్డ్స్‌లో హాలీవుడ్ టాప్ డైరెక్టర్..

ఆర్ఆర్ఆర్ ఇలా విదేశాల్లోనూ అవార్డులను అందుకుంటుండటంతో చిత్ర యూనిట్, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ సినిమాకు ఆస్కార్ బరిలో ఖచ్చితంగా అవార్డు దక్కాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాను గ్లోబల్‌గా ప్రమోట్ చేస్తూ ఆర్ఆర్ఆర్ యూనిట్ బిజీగా ఉంటుంది. మరి ఈ సినిమా మున్ముందు ఇంకా ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంటుందో చూడాలి.