RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ప్రెస్టీజియస్ HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా, ఈ సినిమా ఇంకా తనదైన మార్క్‌ను వేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకుని ఇంకా సందడి చేస్తోంది.

RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ప్రెస్టీజియస్ HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్

RRR Wins HCA Spotlight Winner Award

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా, ఈ సినిమా ఇంకా తనదైన మార్క్‌ను వేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకుని ఇంకా సందడి చేస్తోంది. ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు నామినేట్ కాగా, రీసెంట్‌గా దర్శకుడు రాజమౌళికి న్యూయార్క్ ఫిలిం సిటీ సర్కిల్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది.

RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

కాగా, ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు ప్రెస్టీజియస్ HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డు దక్కింది. ఈ మేరకు HCA(హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. ఇక తమకు ఈ ప్రెస్టీజియస్ అవార్డు రావడంపై ఆర్ఆర్ఆర్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాను గ్లోబల్‌గా ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.

RRR: 2022లోని వరల్డ్ టాప్ 50 సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’కి చోటు

ఇక ఈ అవార్డుతో ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ఆస్కార్ అవార్డులు కూడా రావడం ఖాయమని పలువరు సినీ ఎక్స్‌పర్ట్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంటూ వెళ్తున్న ఆర్ఆర్ఆర్, త్వరలోనే ఆస్కార్ అవార్డులు కూడా అందుకోవాలని వారు కోరుతున్నారు. ఇక HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డులను 2023 ఫిబ్రవరి 24న ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.