RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డు.. జపాన్ అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా ఎంపిక!
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే ఈసారి యావత్ ప్రపంచ సినీ లవర్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయంగా పలు అవార్డులను కైవసం చేసుకుని ఆస్కార్ రేసులో హాట్ ఫేవరెట్ మూవీగా నిలిచింది.

RRR: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే ఈసారి యావత్ ప్రపంచ సినీ లవర్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయంగా పలు అవార్డులను కైవసం చేసుకుని ఆస్కార్ రేసులో హాట్ ఫేవరెట్ మూవీగా నిలిచింది.
RRR : ఆస్కార్‌కి ఎంపిక చేయనందుకు బాధపడ్డా.. రాజమౌళి!
అయితే ఇలాంటి తరుణంలో ఆర్ఆర్ఆర్ మూవీ మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకమైన జపాన్ అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా ఆర్ఆర్ఆర్ అవార్డును సొంతం చేసుకుంది. జపాన్ దేశంలో గతేడాది భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జపాన్ దేశవాసులు ఈ సినిమాను అదిరిపోయే రేంజ్లో ఆదరించారు. దీంతో ఈ సినిమాకు జపాన్ అకాడెమీ అవార్డు రావడం మరింత సులభతరం అయ్యింది. ఇక ఈ అవార్డును మార్చి 10న అందజేయనున్నారు.
జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 650 మిలియన్ యెన్లు కలెక్ట్ చేసి, ఆ దేశంలో ఎక్కువ మొత్తంలో వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇక ఈ సినిమా ఇటీవల బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్, భారత సినీ చరిత్రను తిరిగి రాస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
【速報】#RRR が第46回日本アカデミー賞
優秀外国作品賞に選ばれました㊗️🏆🎶https://t.co/58o6UYbUsrまだまだRRRの勢いはとまりません‼️
絶賛爆進中➡︎➡︎➡︎🔥#RRRMovie#追いRRR pic.twitter.com/b5AdAajXyh— 映画『RRR』公式 (@RRR_twinmovie) January 23, 2023