Jai Bhim : హీరో సూర్యను కొడితే రూ.లక్ష… పీఎంకే సంచలన ప్రకటన

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం జై భీమ్. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అదే సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంటోంది.

Jai Bhim : హీరో సూర్యను కొడితే రూ.లక్ష… పీఎంకే సంచలన ప్రకటన

Pmk

PMK : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం జై భీమ్. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అదే సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంటోంది. కొన్ని వర్గాల ప్రజలు, రాజ‌కీయ పార్టీలు, స‌ద‌రు పార్టీల‌కు చెందిన నేత‌లు జై భీమ్ సినిమాలోని స‌న్నివేశాల‌ను త‌ప్పు ప‌డుతున్నారు.

చెంపదెబ్బ సీన్‌పై వివాదం సమసిపోకముందే ఈ చిత్రంలోని మరో సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తమైంది. సినిమాలోని ఒక సీన్‌ మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉండటంతో ఆ సన్నివేశంపై ప్రేక్షకుల్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా జై భీమ్ చిత్ర దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్‌కు లేఖ ఇచ్చారు. ఇదే క్రమంలో హీరో సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని పీఎంకే పార్టీ నేతలు సంచలన ప్రకటన చేశారు. మైలాడుతురైలో జై భీమ్ సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు ఆ ప్రాంతంలో నిరసనకు దిగారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

అంతే కాదు.. వ‌న్నియార్ అనే సామాజిక వ‌ర్గాన్ని జై భీమ్ చిత్రంలో సూర్య అవ‌మానించార‌ని, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పి న‌ష్టప‌రిహారం కింద రూ.5 కోట్లు ఇవ్వాల‌ని వ‌న్నియార్ సంఘ ప్ర‌తినిధులు కోరుతూ నోటీసులు ఇచ్చారు.

కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి ఇదే వివాదంపై ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై హీరో సూర్య స్పందించారు. ఈ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. కేవలం దళితులపై జరుగుతున్న ఘటనలను మాత్రమే ఖండిస్తున్నట్టు వివరించారు. దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందన్నారు. ఇది ఇలా ఉంటే పలువురు ప్రముఖులు సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

జై భీమ్ చిత్రంలో సామాజిక అస‌మాన‌త‌ల‌పై పోరాటం చేసిన లాయ‌ర్ చంద్రు పాత్ర‌లో సూర్య న‌టించారు. త‌మిళ‌నాడు క‌డ‌లూర్‌లో జ‌రిగిన ఓ నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజైంది. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. అదే సమయంలో సూర్య విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కొవాల్సి వస్తోంది.