Saindhav: సైంధవ్ కోసం ఫస్ట్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్న శైలేష్..?

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శైలేష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Saindhav: సైంధవ్ కోసం ఫస్ట్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్న శైలేష్..?

Ruhani Sharma Locked For Venkatesh Saindhav Movie

Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శైలేష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Saindhav: వెంకీ ‘సైంధవ్’ కోసం ఏకంగా ముగ్గరు హీరోయిన్లు.. కానీ అదే ట్విస్టు!

ఈ సినిమాలో వెంకీ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రుహాని శర్మను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. హిట్ సినిమాలో రుహాని హీరోయిన్‌గా నటించడంతో, ఆమె పర్ఫార్మెన్స్ నచ్చిన శైలేష్, ఇప్పుడు సైంధవ్ మూవీలోనూ ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే హీరోహీరోయిన్ మధ్య ఎలాంటి రొమాన్స్ లేకపోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఛాలెంజింగ్ రోల్ ఉండనుందని తెలుస్తోంది.

Saindhav: వెంకటేష్ ‘సైంధవ్’ బ్యాక్‌డ్రాప్ ఇదేనా..?

ఈ పాత్రకు రుహాని మాత్రమే న్యాయం చేయగలదని భావించిన శైలేష్ ఆమెను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. పోర్ట్‌ ఏరియా బ్యాక్‌‌డ్రాప్‌లో సాగే కథ నేపథ్యంలో సైంధవ్‌ మూవీ రానుండగా, ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.