Rukshar Dhillon : ప్రేమ పెళ్లి చేసుకుంటాను.. నాకు అలాంటి అబ్బాయి కావాలి..

ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి రుక్సార్‌ మాట్లాడుతూ.. ''మా ఇంట్లో దాదాపు అందరూ ప్రేమ వివాహాలే చేసుకున్నారు. నేను కూడా ప్రేమ పెళ్లే...........

Rukshar Dhillon : ప్రేమ పెళ్లి చేసుకుంటాను.. నాకు అలాంటి అబ్బాయి కావాలి..

Ruksar

Rukshar Dhillon :  తెలుగులో ఆకతాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రుక్సార్‌ థిల్లాన్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం, అల్లు శిరీష్ సరసన ABCDలో నటించి మెప్పించింది. ప్రస్తుతం విష్వక్సేన్ సరసన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా మే 6న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రుక్సార్‌ ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్తూ, తన గురించి కూడా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

Bollywood : రంజాన్ వీకెండ్ కూడా బాలీవుడ్ కి కలిసి రాలేదు.. బోల్తా పడ్డ భారీ సినిమాలు..

 

ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి రుక్సార్‌ మాట్లాడుతూ.. ”మా ఇంట్లో దాదాపు అందరూ ప్రేమ వివాహాలే చేసుకున్నారు. నేను కూడా ప్రేమ పెళ్లే చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను బాగా అర్థం చేసుకుని, నా కెరీర్‌ను సపోర్ట్‌ చేస్తూ, నా అభిప్రాయాలను గౌరవించే అబ్బాయి కావాలి. అలాంటి అబ్బాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని తెలిపింది. ఇక తనకి డైరెక్టర్ సుకుమార్‌ అంటే ఇష్టమని, ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని తెలిపింది. తెలుగులో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ అంటే ఇష్టమని వారితో కలిసి నటించాలనుందని చెప్పింది.