అంతరిక్షంలో సినిమా షూటింగ్.. చరిత్ర సృష్టించనున్న రష్యా

అంతరిక్షంలో సినిమా షూటింగ్.. చరిత్ర సృష్టించనున్న రష్యా

టామ్ క్రూజ్ అధికారికంగా ఇంటర్నేషనల్ రేసులో ఉన్నారు. అంతరిక్షంలో తొలిసారి సినిమా షూట్ చేసే పనిలో పడ్డారు. రష్యన్ స్పేస్ ఏజెన్సీ రొసోమాస్ అధికారికంగా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాలు వెల్లడించింది. అంతరిక్షంలో షూటింగ్ చేసేందుకు ముందుకొచ్చిన ప్రపంచంలోనే తొలి దేశంగా రష్యా నిలిచింది. రష్యాలోనే అతిపెద్ద స్టూడియో.. యెల్లో, బ్లాక్ అండ్ వైట్ స్టూడియో ఈ పనికి పూనుకోనున్నట్లు సమాచారం.

రాబోయే శీతాకాలం 2021లో ఓ ఫ్లైట్ తో దీనికి పూనుకునే విధంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రెడీ చేయనుంది. ‘ఓపెన్ కాంటెస్ట్ లో భాగంగా.. ప్రొటోజనిస్ట్ ఐఎస్ఎస్ కు ఎగిరిపోనున్నారు.



సినిమా పేరు, నటీనటులు, షూటింగ్ చేయబోయే ప్రదేశం గురించి చర్చలు నడుస్తున్నాయి. దాంతో పాటు టెక్నికల్ గా స్పేస్ లో సినిమాను ఎలా చిత్రీకరించాలో కూడా ప్లాన్లు చేస్తున్నారు. రష్యా స్పేస్ యాక్టివిటీస్ ను పాపులర్ చేసే ఉద్దేశ్యంగానే సినిమా తీయాలని అనుకుంటున్నారట.

హాలీవుడ్ ఏ-లిస్టర్ టామ్ క్రూయిజ్.. SpaceXతో కలిసి స్పేస్ లో యాక్షన్ మూవీ తీయనున్నారు ‘NASA టామ్ క్రూయీజ్ తో కలిసి సినిమా కోసం పనిచేయడానికి ఎగ్జైట్మెంట్ తో ఉంది. అని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టిన్ మే నెలలో ట్వీట్ చేసింది. SpaceX సీఈఓ ఎలోన్ మస్క్ దీని ద్వారా చాలా సరదాగా అనిపిస్తుందని కామెంట్ చేశారు.