తారకరత్న ‘ఎస్5’ ప్రారంభం : ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

నందమూరి తారకరత్న కొత్త సినిమా ‘ఎస్5’ (నో ఎగ్జిట్).. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 06:21 AM IST
తారకరత్న ‘ఎస్5’ ప్రారంభం : ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

నందమూరి తారకరత్న కొత్త సినిమా ‘ఎస్5’ (నో ఎగ్జిట్).. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

చిన్న విరామం తర్వాత నందమూరి తారకరత్న కొత్త సినిమా చేయనున్నాడు. ప్రిన్స్ హీరోగా, అవంతిక‌, రుతుజ సావంత్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఎస్5’ (నో ఎగ్జిట్) అనేది ట్యాగ్.. సన్నీ కోమలపాటి దర్శకత్వంలో, సాగా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ఆర్ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్ధలు కలిసి నిర్మిస్తున్నాయి. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్‌ గా ‘ఎస్5’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తారకరత్న ఈ సినిమాకోసం చాలా బాగా మేకోవర్ అయ్యాడు. హెయిర్ స్టైల్, గెడ్డంతో సైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. ‘మెలోడిబ్రహ్మ’ మణిశర్మ సంగీతమందించనున్నారు.

Read Also : ప్రభాస్‌తో పెళ్లయితే ప్రతిరోజూ పండగే : కాజల్ మనసులో మాట

ఈ సినిమాకోసం మొట్టమొదటిసారి ‘రెడ్ రేంజర్ విస్టా విజన్’ కెమెరా వాడుతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సినిమటోగ్రఫీ : ‘గరుడవేగ’ అంజి, ఎడిటింగ్ : గ్యారీ, మ్యూజిక్ : మణిశర్మ, నిర్మాతలు : గౌతమ్ కొండెపూడి, రాహుల్ రెడ్డి.