ప్రభాస్ బర్త్‌డేకి ఆన్‌లైన్‌లో సాహో

అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ‘సాహో’ హిందీ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : October 10, 2019 / 07:21 AM IST
ప్రభాస్ బర్త్‌డేకి ఆన్‌లైన్‌లో సాహో

అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ‘సాహో’ హిందీ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన  మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. ఆగస్టు 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. నాలుగు వారాల పాటు థియేటర్లలో సందడి చేసిన సాహో.. ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.

త్వరలో ఈ సినిమా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ఎంత స్పీడ్‌గా డెవలప్ అవుతున్నాయో, వాటి వినియోగం ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం.. సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాలు లేదా రెండు, మూడు వారాల్లోనే అమెజాన్‌లో వచ్చేస్తున్నాయి..

Read Also : వరుణ్ తేజ్ (VT10) – ప్రారంభం..

అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ‘సాహో’ హిందీ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరికొద్ది రోజుల్లో తెలగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు..