Saara Alikhan : నాకు ఇల్లరికం వచ్చే భర్తే కావాలి: సారా అలీఖాన్

సారా అలీఖాన్ తనకి రాబోయే భర్త ఎలా ఉండాలో చెప్తూ.. 'నాకు మా అమ్మే సర్వస‍్వం. ఆమెతో ఉండటమే నాకు సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నాకు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ....

Saara Alikhan : నాకు ఇల్లరికం వచ్చే భర్తే కావాలి: సారా అలీఖాన్

Sara Alikhan

Saara Alikhan :    సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చినా తండ్రి పేరుని ఉపయోగించుకోకుండా సొంతగా ఎదుగుతుంది సారా అలీఖాన్‌. ‘కేదరినాథ్‌’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన సారా ‘లవ్‌ ఆజ్‌కల్‌’, ‘కూలీ నం 1’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఇటీవల విడుదలైన ‘ఆత్రంగి రే’ సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఇటీవల ‘ఆత్రంగి రే’ సక్సేస్‌ మీట్‌లో పాల్గొన్న సారా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది.

సారా అలీఖాన్ తనకి రాబోయే భర్త ఎలా ఉండాలో చెప్తూ.. ‘నాకు మా అమ్మే సర్వస‍్వం. ఆమెతో ఉండటమే నాకు సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నాకు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ నేను నా తల్లి సహాయం లేకుండా మ్యాచింగ్‌ బ్యాంగిల్స్‌, దుస్తులను కూడా వేసుకోలేను. ఇలా ఇంటర్వ‍్యూలకు కూడా రాలేను. నేను ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చేది మా అమ్మ దగ్గరికే. ఆమెతో నాకు అంత మంచి అనుబంధం ఉంది. ఆమె నాతో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తాను ఎప్పుడూ అలాగే ఉంటుందని భావిస్తున్నాను. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకున్నా నేను మా అమ్మతో కలిసి జీవించగలిగే వ్యక్తినే చేసుకుంటాను. అంటే అతను ఇల్లరికం రావాలి. నేను మా అమ్మని ఎప్పటికీ విడిచిపెట్టను. ఇల్లరికాన్ని ఒప్పుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపింది.

Singer Sunitha: అరటి తోటలో సింగర్‌ సునీత.. వీడియో వైరల్‌

బాలీవుడ్ బ్యూటీ అడిగితే ఇల్లరికం రాకుండా ఉండే వాళ్ళు ఉంటారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ సారా వాళ్ళ అమ్మతో ఎప్పుడో విడిపోయినట్లు మన అందరికి తెలిసిందే.