Pooja Hegde: పాపం పూజ.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న నెటిజన్లు!

నాకు నేనే స్టార్.. పెద్ద కో స్టార్ అవసరం లేదు.. ఇదీ ఆ మధ్య బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇచ్చిన స్టేట్మెంట్. ప్రభాస్, బన్నీ..

Pooja Hegde: పాపం పూజ.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న నెటిజన్లు!

Pooja Hegde

Pooja Hegde: నాకు నేనే స్టార్.. పెద్ద కో స్టార్ అవసరం లేదు.. ఇదీ ఆ మధ్య బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇచ్చిన స్టేట్మెంట్. ప్రభాస్, బన్నీ, సల్మాన్, రణ్ వీర్.. ఇలా హీరో ఎవరన్నది తనకు ముఖ్యం కాదని.. నాకు నేనే స్టార్ అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుందని అప్పుడే పెద్ద దుమారం రేగింది.

Pooja Hegde: జిగేలు రాణి ఈజ్ బ్యాక్.. ఎఫ్‌3లో పూజా స్పెషల్ ట్రీట్!

వరస హిట్ సినిమాలతో సౌత్ టూ నార్త్ అమ్మడి బిజీ షెడ్యూల్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాతలు అమ్మడి వెంట పడడం.. అలా మాట్లాడించిందని అంతా అనుకున్నారు. వరుస సినిమాలు సూపర్ హిట్లు పడడంతో పూజా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తన దూకుడు చూపించింది. అలా ఓ రేంజ్ లో సాగిపోతున్న పూజ ఆటిట్యూడ్ కూడా ఓ రేంజ్ లో చూపించింది.

Pooja Hegde: పూజా రేటు కోటి.. సినిమాకు కాదండోయ్!

ఆ మధ్య స‌మంత లుక్ గురించి మాట్లాడి.. త‌ర్వాత సోష‌ల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు క‌వ‌ర్ చేసుకుంది. ఇక రాధేశ్యామ్ టైంలో ప్ర‌భాస్ ద‌గ్గ‌రా యాటిట్యూడ్ చూపించింద‌నే వార్త‌లొచ్చాయి. ట్విట్ట‌ర్లో చిట్ చాట్‌ల సంద‌ర్భంగా కూడా పూజా చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అప్పుడు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. దీంతో కొందరు పూజ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ కనిపించారు. వాళ్ళకి ఇప్పుడు టైం స్టార్ట్ అయింది.

Pooja Hegde-Rashmika: నువ్వా.. నేనా.. ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ ఇద్దరే!

పూజకి ఇప్పుడు వరస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నెల కింద‌టే రాధేశ్యామ్ ఫ్లాప‌వ‌డం.. తాజాగా బీస్ట్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఆమెను ట్విట్ట‌ర్లో కొందరు ఆట ఆటాడేసుకుంటున్నారు. ముఖ్యంగా బీస్ట్ లో పూజ పాత్రపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత దానికి అంత బిల్డప్ ఇచ్చావా పూజా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా చేతిలో మ‌హేష్ బాబు-త్రివిక్ర‌మ్ సినిమా, భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాలున్నాయి. ఇవి సక్సెస్ కొడితే తప్ప ఈ కామెంట్స్ ఆగేలా లేవు!