SDT 15 : సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా స్టోరీ ఇదేనా.. ఫస్ట్ లుక్ రిలీజ్..

యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాయిధరమ్ తేజ్ మళ్ళీ ప్రేక్షకులని పలకరించనున్నాడు. యాక్సిడెంట్ వల్ల దాదాపు ఆరునెలలు రెస్ట్ తీసుకోవాల్సి.................

SDT 15 : సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా స్టోరీ ఇదేనా.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Sai Dharam Tej

Sai Dharam Tej :  యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాయిధరమ్ తేజ్ మళ్ళీ ప్రేక్షకులని పలకరించనున్నాడు. యాక్సిడెంట్ వల్ల దాదాపు ఆరునెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సాయిధరమ్ తేజ్. ఇటీవలే పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు.

Sdt

 

సాయిధరమ్ తేజ్ 15వ సినిమాని కార్తీక్‌ దండు దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 25 రోజుల్లో 30 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది.

Aishwarya Rajesh : మొదటిసారి రెచ్చిపోయి ఫోజులిచ్చిన ఐశ్వర్య రాజేష్

అయితే టాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా స్టోరీ ఇదే అని తెలుస్తుంది. ఓ ఊళ్లో వరుసగా కొంతమంది చనిపోతుండటంతో దానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలని వెళ్లిన యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆ చావుల వెనక రహస్యం ఏమిటి?, బ్లాక్‌ మేజిక్‌, మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఇలాంటి కథ మొదటి సారి చేయడం. దీంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తెర మీద ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.