Medicover : గోల్డెన్ అవర్‌లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది

గోల్డెన్ అవర్ లో తీసుకొచ్చారు కనుకే నటుడు సాయి ధరమ్ తేజ్ కు పెను ప్రమాదం తప్పిందని,  హెల్మెట్ ధరించడం వల్ల హెడ్ ఇంజూరీస్ కాలేదన్నారు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్.

Medicover : గోల్డెన్ అవర్‌లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది

Medicover

Sai Dharam Tej Accident : గోల్డెన్ అవర్ లో తీసుకొచ్చారు కనుకే నటుడు సాయి ధరమ్ తేజ్ కు పెను ప్రమాదం తప్పిందని,  హెల్మెట్ ధరించడం వల్ల హెడ్ ఇంజూరీస్ కాలేదన్నారు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యిందన్న విషయం తెలుసుకున్న మెగా కుటుంబం, అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే..ఆయనకు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయంపై డాక్టర్ సతీష్…10tvతో మాట్లాడారు.

Read More : సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి కారణమైన స్పోర్ట్స్ బైక్ ఇదే..!

రోడ్డు ప్రమాదం అయిన తర్వాత..ఇక్కడకు తీసుకరావడం జరిగిందని ఈ సమయంలో…ఆయన సృహలో లేడన్నారు. వెంటనే కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందించినట్లు…ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు ఫిట్స్ వచ్చినట్లు 108 సిబ్బంది తెలిపారు. ఫిట్స్ ఆయనకు ఉన్నాయా ? లేదా ? అనేది తమ దృష్టికి రాలేదని..షాక్ వల్ల..కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే..సకాలంలో ఆసుపత్రికి తీసుకరావడం వల్ల…ప్రాణాపాయం తప్పిందన్నారు. సిటీ స్కాన్ నుంచి అన్ని స్కానింగ్ లు చేశామని, ఈ రిపోర్టలన్నీ నార్మల్ గా ఉన్నాయన్నారు. షోల్డర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యిందని, బాడీలో చిన్న చిన్న ఇంజూరీస్ మాత్రం ఉన్నాయన్నారు.

Read More : Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు : మెగాస్టార్ చిరంజీవి

మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్…మాదాపూర్ లోని కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జీ వద్ద స్పోర్ట్స్ బైక్ పై నుంచి అదుపు తప్పి కిందపడిన సంగతి తెలిసిందే. బైక్ పై వస్తున్న తేజ్.. బైక్ స్కిడ్ కావడంతో పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్ ఉండటంతో తలకు రక్షణ లభించింది. లేదంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని పోలీసులు అన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.