Sai Dharam Tej : మారుతితో సుప్రీం హీరో సెకండ్ సినిమా..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ - మారుతి కాంబినేషన్‌లో మరో సినిమా..

Sai Dharam Tej : మారుతితో సుప్రీం హీరో సెకండ్ సినిమా..

Sai Tej

Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై.. ఇటీవలే పూర్తిగా కోలుకున్నాడు. 2021 నవంబర్ 14తో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej : సెవన్ ఇయర్స్ ఫర్ సుప్రీం హీరో..

దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చెయ్యకపోయినా.. మంచి సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ‘రిపబ్లిక్’. నవంబర్ 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Balakrishna – Jr NTR : నందమూరి ఫ్యాన్స్‌‌కి గుడ్‌న్యూస్.. త్వరలో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్..

తేజ్ కోలుకోవడంతో తర్వాత ఏ దర్శకుడితో సినిమా చెయ్యనున్నాడనే విషయం మీద ఆసక్తి నెలకొంది. ‘ప్రతి రోజూ పండగే’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌తో తనను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసిన టాలెంటెడ్ దర్శకుడు మారుతితో మరో సినిమా చెయ్యబోతున్నాడు తేజ్. పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు.

Manchu Lakshmi ‘అఖండ’ డైలాగులు అదరగొట్టిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..