SDT15: విరూపాక్ష.. పాన్ ఇండియా మూవీగా సత్తా చాటడం ఖాయం!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నేడు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ‘విరూపాక్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ సినిమాలో తేజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, సుకుమార్ ఈ సినిమాకు కథను అందించాడు.

SDT15: విరూపాక్ష.. పాన్ ఇండియా మూవీగా సత్తా చాటడం ఖాయం!

Sai Dharam Tej SDT15 Virupaksha Will Impress Pan India Audience

SDT15: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నేడు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ‘విరూపాక్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ సినిమాలో తేజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, సుకుమార్ ఈ సినిమాకు కథను అందించాడు.

SDT15: పవన్ కళ్యాణ్ టైటిల్ వాడేస్తున్న తేజ్.. నిజమేనా..?

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరుగుతుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో కొందరు ఈ సినిమా నిజంగానే పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటుందా అనే సందేహం వ్యక్తం చేశారు. కానీ, టైటిల్ గ్లింప్స్ వీడియోలో ఈ సినిమాలోని విజువల్స్ అందరినీ కట్టిపడేశాయి. ఇటీవల సబ్జెక్టు యూనివర్సల్ అయితే, హీరోతో సంబంధం లేకుండా ఆ సినిమాను ఆదరిస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

NTR : సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ మాట సాయం..

కాగా, మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్‌గా రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ సత్తాను చాటుకున్నారు. ఇప్పుడు విరూపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా తేజ్‌కు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్‌ను తీసుకొస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.