SDT15: పవన్ కళ్యాణ్ టైటిల్ వాడేస్తున్న తేజ్.. నిజమేనా..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను డిసెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

SDT15: పవన్ కళ్యాణ్ టైటిల్ వాడేస్తున్న తేజ్.. నిజమేనా..?

Sai Dharam Tej Using Pawan Kalyan Title For SDT15

SDT15: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను డిసెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Sai Dharam Tej: తేజు బర్త్‌డే గిఫ్ట్.. SDT15 నుండి ఇంటెన్స్ పోస్టర్!

కాగా, ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో తారక్ ఎలాంటి పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతాడా.. ఈ సినిమాకు ఎంతటి పవర్‌ఫుల్ టైటిల్‌ను పెడతారా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి నెట్టింట ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుండటంతో ఈ సినిమాకు ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అయితే జనాల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తుందట. అందుకే ఈ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

NTR : సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ మాట సాయం..

అయితే, గతంలో ఈ టైటిల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాకు పెట్టుకుంటాడని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు తొలుత ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. ఆ తరువాత ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విరూపాక్ష అంటే శివుడు అని అర్థం వస్తుందని.. తేజు నటిస్తున్న చిత్ర నేపథ్యం క్షుద్రపూజలు కావడంతో, ఈ సినిమాకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించి, పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాకు నిజంగానే పవన్ కళ్యాణ్ తన సినిమాకు పెట్టాలని చూసిన ‘విరూపాక్ష’ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా.. అనే విషయం తెలియాలంటే డిసెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.