Sai Pallavi : పుట్టపర్తిలో సాయి పల్లవి.. దైవ చింతనలో న్యూ ఇయర్ వేడుకలు..
తాజాగా సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు దైవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ దైవ కార్యక్రమాల్లో సాయి పల్లవి.............

Sai Pallavi appears in puttaparthi saibaba temple
Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల సినిమాలేమి ఒప్పుకోకుండా మీడియా కంట కూడా పడకుండా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చివరిసారిగా సాయి పల్లవి గార్గి సినిమాలో నటించగా ఆ సినిమా ప్రమోషన్స్ లోనే కనిపించింది. ఆ తర్వాత సాయి పల్లవి సినిమాలకి దూరం అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సాయి పల్లవి మాత్రం స్పందించలేదు.
తాజాగా సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు దైవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ దైవ కార్యక్రమాల్లో సాయి పల్లవి పాల్గొంది. సాంప్రదాయంగా చీరలో సాధారణ భక్తుల్లాగే వచ్చి అందరి మధ్యలో కూర్చొని పుట్టపర్తి సాయిబాబా దైవ చింతనలో తన నూతన సంవత్సర మొదటి రోజుని గడిపింది.
Raviteja : 2022 చాలా కష్టంగా ఉంది.. ధమాకా సక్సెస్ ని వాళ్ళకి అంకితం చేస్తున్నాను..
సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడటంతో కొంతమంది సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. మరి సాయి పల్లవి సినిమాల్లో కనిపిస్తుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సాయి పల్లవి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు.