Sai Pallavi : నేను అందుకే మేకప్ వేసుకోను.. అదే నాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది..

సాయి పల్లవి మేకప్ వేసుకోదు, హెవీ గా రెడీ అవ్వదు, సినిమాల్లో కూడా మేకప్ లేకుండానే నటిస్తుంది. ఓ ఫెయిర్ నెస్ క్రీం యాడ్ ఆఫర్ వచ్చినా చేయలేదు. ఇవన్నీ సాయి పల్లవికి మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చాయి. తాజాగా సాయి పల్లవి ప్రముఖ సినీ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా..........................

Sai Pallavi : నేను అందుకే మేకప్ వేసుకోను.. అదే నాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది..

sai pallavi comments on why she doesn't apply makeup

Sai Pallavi :  సాయి పల్లవి.. చేసింది తక్కువ సినిమాలైనా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళంలో ప్రేమమ్(Premam) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో ఫిదాతో(Fidaa) వచ్చి అనంతరం తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేసి స్టార్ గా మారింది. ఏకంగా సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్(Power Star) అన్నారంటే తెలుగులో ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తన నటన, డ్యాన్స్ తో థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించడమే కాక, తన మంచి మనసు, మాటలు, అందరి హీరోయిన్స్ లాగా ఓవర్ గా ఉండకుండా సింపుల్ గా ఉండటం.. ఇవన్నీ కూడా ప్రేక్షకులకు నచ్చి ఆమెని ఇష్టపడేలా చేశాయి.

సాయి పల్లవి చివరిసారిగా గార్గి సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలలో కనపడలేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఓ సినిమా ఉంది. అయితే సాయి పల్లవి సినిమాలు మానేసిందని, తాను డాక్టర్ కావడంతో హాస్పిటల్ కడుతుందని వార్తలు వచ్చాయి. కానీ వీటిపై సాయి పల్లవి స్పందించలేదు. అభిమానులు మాత్రం ఈ వార్తలు విని సాయిపల్లవి సినిమాలు చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి సాయి పల్లవి మరోసారి వెండితెరపై తన మ్యాజిక్ ఎప్పుడు చూపిస్తుందో చూడాలి.

సాయి పల్లవి మేకప్ వేసుకోదు, హెవీ గా రెడీ అవ్వదు, సినిమాల్లో కూడా మేకప్ లేకుండానే నటిస్తుంది. ఓ ఫెయిర్ నెస్ క్రీం యాడ్ ఆఫర్ వచ్చినా చేయలేదు. ఇవన్నీ సాయి పల్లవికి మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చాయి. తాజాగా సాయి పల్లవి ప్రముఖ సినీ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఈ విషయాలపై మాట్లాడింది.

Das Ka Dhamki : అదిరిపోయిన దాస్ కా ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..

సాయి పల్లవి మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేదాన్ని. నా వాయిస్ బాగోదు, నా ఫేస్ బాగోదు, నా ఫేస్ పై పింపుల్స్, నేను కనిపించే తీరు.. ఇవన్నీ నన్ను భయపెట్టేవి. మొదటి నుంచి కూడా నా ఫేస్ అలా ఉండటంతో నేను ఎలాంటి మేకప్స్ వాడలేదు. కానీ హీరోయిన్ గా నా మొదటి సినిమా దర్శకుడు నాలో ఏదో స్పెషల్ ఉందని గ్రహించి నాకు ఛాన్స్ ఇచ్చాడు. నా మొదటి సినిమాలో కూడా నేను మేకప్ వేసుకోలేదు. ఆ సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది. తెరపై నన్ను చూసి ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఆ తర్వాత నన్ను ప్రేక్షకులు మరింత ఇష్టపడ్డారు. తెరపై నన్ను చూసినప్పుడు చప్పట్లు, ఈలలు వేశారు. అది వాస్తవంగా జరిగింది. నాకు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ప్రేక్షకులు మన అందాన్ని చూసి ప్రేమించరు, మనం బయట ఎలా ఉంటాం అనే దాన్ని కూడా చూస్తారని నాకు అర్థమైంది. అది నన్ను మరింత కాన్ఫిడెంట్ గా మార్చింది. ఒక వ్యక్తిగా నాకు మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చింది ప్రేక్షకులే. నా మొదటి సినిమా ప్రేమమ్ దర్శకుడు ఆల్ఫోన్స్ కారణంగానే నేను ఇక్కడిదాకా వచ్చాను, ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని తెలిపింది.