Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!

అందాల భామ సాయి పల్లవి నటించిన రీసెంట్ మూవీ ‘విరాటపర్వం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి....

Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!

Sai Pallavi Gargi Trailer Released

Sai Pallavi: అందాల భామ సాయి పల్లవి నటించిన రీసెంట్ మూవీ ‘విరాటపర్వం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఈ సినిమా ఇటీవల ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా నుండి ఇంకా బయటపడని సాయి పల్లవి ఫ్యాన్స్‌కు మరో అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది ఈ బ్యూటీ.

Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!

తమిళ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో ఓ కోర్టు డ్రామా మూవీగా రాబోతున్న ‘గార్గి’ అనే సినిమాను సాయి పల్లవి రిలీజ్‌కు రెడీ చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ డ్రామాగా సాగడంతో ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు మరోసారి ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

తన తండ్రిని అన్యాయంగా ఓ కేసులో ఇరికించి జైలులో వేయడం.. అతడిని ఆ కేసు నుండి బయటపడేసేందుకు సాయి పల్లవి సమాజాన్ని ఎదురించి నిలిచే విధానం ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగులోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది సాయి పల్లవి. ఈ సినిమా మొత్తం సీరియస్ నోట్‌పై సాగుతుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి తన తండ్రికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న గార్గి చివరకు విజయం సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఇక ఈ సినిమాను జూలై 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ గ్రిప్పింగ్ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.