Sai Pallavi : సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై.. డాక్టర్‌గా బిజీ కాబోతున్న యాక్టర్?

చిత్రసీమలో హీరోయిన్ గా రాణించాలి అంటే గ్లామర్ షో తప్పనిసరి అని చాలామంది హీరోయిన్‌లు అంటుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఎటువంటి గ్లామర్ షో చేయకుండా, ప్రధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. కాగా ఈ అమ్మడు త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి డాక్టర్ కానుందట.

Sai Pallavi : సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై.. డాక్టర్‌గా బిజీ కాబోతున్న యాక్టర్?

Sai Pallavi is ready to good bye to movies

Sai Pallavi : చిత్రసీమలో హీరోయిన్ గా రాణించాలి అంటే గ్లామర్ షో తప్పనిసరి అని చాలామంది హీరోయిన్‌లు అంటుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఎటువంటి గ్లామర్ షో చేయకుండా, ప్రధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ సౌత్ లో ఏ స్టార్ హీరోయిన్ కి ఉండదు. అందుకే సాయిపల్లవిను లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు ఆమె అభిమానులు.

Sai Pallavi: “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” అంటున్న.. సాయి పల్లవి!

కాగా ఈ అమ్మడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేయడంతో, సినిమా సినిమాకు చాలా గ్యాప్ వస్తుంటది. దీంతో ఈ గ్యాప్ లో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఇటువంటి వార్తలు తెరపైకి వచ్చాయి. విరాటపర్వం, గార్గి సినిమాలు తరువాత మరో సినిమాకు ఓకే చెప్పడం లేదు ఈ లేడీ పవర్ స్టార్. అయితే యాక్టర్ కాకముందు సాయిపల్లవి డాక్టర్ అని అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ నటి కోయంబత్తూర్‌లో ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందని తెలుస్తోంది.

తన చెల్లితో కలిసి, ఆమె చదువుకున్న వైద్య వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయంతో.. సాయిపల్లవి ప్రస్తుతం ఏ సినిమాకు కమిట్ అవ్వడం లేదని సమాచారం. ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తూ ఒక బడా నిర్మాత భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసినా, సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ వార్త సాయిపల్లవి అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది.