Sai Pallavi: పుష్ప-2లో సాయి పల్లవి.. క్లారిటీ ఇచ్చేసిన లేడీ పవర్ స్టార్!

అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల సాయి పల్లవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తుందని.. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి.

Sai Pallavi: పుష్ప-2లో సాయి పల్లవి.. క్లారిటీ ఇచ్చేసిన లేడీ పవర్ స్టార్!

Sai Pallavi On Rumours Of Acting In Pushpa 2

Sai Pallavi: అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. సాయి పల్లవి నటించిన రీసెంట్ చిత్రాలు ‘విరాటపర్వం’, ‘గార్గి’లో ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉంది ఈ బ్యూటీ.

Sai Pallavi : ఎన్టీఆర్, చరణ్, బన్నీలలో సాయి పల్లవి ఎవరితో డాన్స్ చేయాలి అనుకుంటుందో తెలుసా?

అయితే, ఇటీవల సాయి పల్లవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తుందని.. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి ఈ వార్తలపై స్పందించింది. తాను పుష్ప-2 సినిమాలో నటించడం లేదని.. తనకు ఈ సినిమా నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని ఆమె చెప్పుకొచ్చింది.

Sai Pallavi Will Acts In Pushpa 2? : సాయిపల్లవిపై క్రేజీ రూమర్స్

కానీ, తాను పుష్ప-2లో నటిస్తున్నానంటూ వార్తలు రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని సాయి పల్లవి తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె తన నెక్ట్స్ మూవీని తమిళ హీరో శివకార్తికేయన్‌తో కలిసి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.