Sai Pallavi: కోట్లకు కోట్లే వదిలేసుకున్న సాయి పల్లవి

వచ్చిన ప్రతీ అవకాశం (సినిమా)కు ఓకే చెప్పేయకుండా తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయని సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి.

Sai Pallavi: కోట్లకు కోట్లే వదిలేసుకున్న సాయి పల్లవి

sai-pallavi

Sai Pallavi: వచ్చిన ప్రతీ అవకాశం (సినిమా)కు ఓకే చెప్పేయకుండా తనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయని సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది చూడకుండా కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ ఎంచుకుంటుంది.

కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు.. అలా మూడు సంవత్సరాలుగా కథల విషయంలో తిరస్కరిస్తూ.. దాదాపు రూ.5కోట్లు నష్టపోయిందట. ఒక్కో సినిమాకు రూ.80లక్షల నుంచి కోటి రెమ్యూనరేషన్ తీసుకునే ఈ హైబ్రిడ్ పిల్లకు ఫిదా నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయట.

మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించింది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా అనుకున్నారట. తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుందట ఈ మలయాళ భామ.

మహేశ్‌ బాబు లీడ్ రోల్ లో కనిపించిన‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్‌గా అనుకున్నారట. అయ్యప్పనుమ్ కోషియం (రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలు కూడా రిజెక్ట్ చేసేసింది.

హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో అలా పక్కకు పెట్టేశారు. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్‌ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట. వాటి విలువ దాదాపు రూ.5 కోట్ల పైనే ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. సాయి పల్లవి నటించిన లవ్‌స్టోరీ, విరాటపర్వం చిత్రాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.