Sai Pallavi: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సాయిపల్లవి

కాస్ట్లీ డ్రెస్ లు వేస్కోదు.. ఖరీదైన మేకప్ వాడదు. కోట్లు తెచ్చిపెట్టే యాడ్లు చెయ్యదు.. కథ నచ్చకపోతే.. ఎంత పెద్ద సినిమా అయినా చెయ్యదు. అన్నింటికీ మించి అసలు తను స్టార్ అన్న మాటే..

Sai Pallavi: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సాయిపల్లవి

Sai Pallavi

Sai Pallavi: కాస్ట్లీ డ్రెస్ లు వేస్కోదు.. ఖరీదైన మేకప్ వాడదు. కోట్లు తెచ్చిపెట్టే యాడ్లు చెయ్యదు.. కథ నచ్చకపోతే.. ఎంత పెద్ద సినిమా అయినా చెయ్యదు. అన్నింటికీ మించి అసలు తను స్టార్ అన్న మాటే కేర్ చెయ్యదు. సింప్లిసిటీ కేరాఫ్ అడ్రస్ గా మారిన సాయిపల్లవి సినిమా చూడడానికి ఆటోలో వెళ్లి హాట్ టాపిక్ అయ్యింది.

Liger: ఓ రేంజ్ ప్రమోషన్లు.. రౌడీ హీరో బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్!

స్కిన్ షో చేస్తూ.. గ్లామర్ తో దూసుకుపోతున్న హీరోయిన్లు హల్ చల్ చేస్తున్న సినిమా ఇండస్ట్రీలో సింపుల్ గా నచ్చిన సినిమాలు చేసుకుంటూ నచ్చిన చోటకి వెళుతూ.. వచ్చిన ఎమోషన్ ని ఓపెన్ చూపిస్తూ.. తను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంటోంది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి. నిజానికి అసలు తను ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అని సాయిపల్లవి ఎప్పుడూ గుర్తుంచుకోదేమో. అందుకే ఇంత సెన్సిబుల్ గా సింపుల్ గా ఉంటుందంటున్నారు ఫాన్స్ .

Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?

జనరల్ గా ఓ స్టార్ హీరోయిన్ ధియేటర్లో సినిమా చూడాలంటే.. అదీ ఓ రేంజ్ లో సక్సెస్ అయిన సినిమాని చూడాలంటే.. మినిమం 2,3 కార్లు, చుట్టూ 10మంది సెక్యూరిటీ.. ఇలా ఫుల్ బందోబస్తుగా ధియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి. కానీ సాయిపల్లవి మాత్రం.. శ్యామ్ సింగరాయ్ సినిమా చూడడానికి బురఖా వేస్కుని ఆటోలో వెళ్లి సినిమా చూసొచ్చింది. నార్మల్ ఆడియన్ లానే.. సినిమాచూస్తూ.. మూవీనిఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

సింప్లిసిటీ ఇప్పుడే కాదు.. సాయిపల్లవి ఎప్పుడూ సింపులే. తనకు నచ్చిన పనిచేస్తూ.. వచ్చిన ఎమోషన్ ని ఆడియన్స్ కి చూపిస్తూ.. ప్రేక్షకులకు ఫరెవర్ ఫేవరెట్ అయిపోయింది. మొన్నీమధ్య శ్యామ్ సింగరాయ్ సినిమా ఈవెంట్స్ లో కూడా అంతే. ప్రేక్షకుల చూపిస్తున్న ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంత ప్రేమను పొందడానికి ఎంత అదృష్టం చేసుకుని ఉంటానో అంటూ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. అందుకే ఎంత మంది గ్లామర్ డాల్స్ ఉన్నా.. సాయి పల్లవి సమ్ థింగ్ స్పెషల్ అంతే అంటున్నారు అభిమానులు.