Sai Pallavi : ఎన్టీఆర్, చరణ్, బన్నీలలో సాయి పల్లవి ఎవరితో డాన్స్ చేయాలి అనుకుంటుందో తెలుసా?
నిజం విత్ స్మిత కొత్త ఎపిసోడ్ కి సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నించగా..

Sai Pallavi want to dance with ntr ram charan allu arjun on same stage
Sai Pallavi : ఇతర టాక్ షోలా ఎంటర్‌టైన్ చేయడం కాకుండా సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలు పై ప్రశ్నిస్తూ, నిజం నిర్బయంగా మాట్లాడదాం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’. ఒకప్పటి పాప్ సింగర్ స్మిత ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల మొదలైన ఈ టాక్ షో ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్ లు పూర్తీ చేసుకుంది. చంద్రబాబు నాయుడుతో డెవలప్మెంట్, చిరంజీవితో పట్టుదల-కృషి, రానా-నానిలతో నెపోటిజం, పుల్లెల గోపీచంద్-సుదీర్‌తో స్పోర్ట్స్ లో ప్రాబ్లెమ్స్ పై నిజం నిర్బయంగా మాట్లాడుకుంటూ వచ్చారు.
Nijam with Smitha : నా సక్సెస్‌లో సుధీర్ బాబుది ముఖ్య పాత్ర.. పుల్లెల గోపీచంద్!
తాజాగా ఈ షోకి లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. ఈ ఎపిసోడ్ లో ‘మీ టు’ అంశం పై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే స్మిత మాట్లాడుతూ.. మీ టు అనేది ఈమధ్య కాలంగా చాలా గట్టిగా వినిపిస్తుంది. దాని పై నీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించింది. సాయి పల్లవి బదులిస్తూ.. ఒక వ్యక్తిని శరీరకంగా ఇబ్బందికి గురి చేయడమే తప్పు కాదు, మాటలతో ఇబ్బంది పెట్టినా తప్పే కదా’ అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నించగా.. ముగ్గురితో కలిసి ఒక డాన్స్ నెంబర్ చేయాలని ఉంది అంటూ సాయి పల్లవి బదులిచ్చింది. కాగా వీరి ముగ్గురిలో ఇప్పటి వరకు సాయి పల్లవి ఎవరితోనూ వర్క్ చేయలేదు. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప-2 లో సాయి పల్లవి నటించబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీని పై చిత్ర యూనిట్ స్పందించనప్పటికీ కొంతమంది మాత్రం ఆ వార్తలో నిజంలేదంటూ కొట్టిపడేస్తున్నారు.