Mumbai : ఎయిర్ పోర్టులో కరీనాను ఆపేసిన సెక్యూర్టీ ఆఫీసర్లు, వీడియో వైరల్

బాలీవుడ్ లో వెలుగొందిన కరీనా కపూర్ కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు వచ్చిన కరీనా కపూర్ ను సెక్యూర్టీ విధులు నిర్వహిస్తున్న వారు ఆపేశారు

10TV Telugu News

Saif Ali Khan And Kareena : బాలీవుడ్ లో వెలుగొందిన కరీనా కపూర్ కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు వచ్చిన కరీనా కపూర్ ను సెక్యూర్టీ విధులు నిర్వహిస్తున్న వారు ఆపేశారు. పాస్ పోర్టు తదితర వివరాలు అడిగిన తర్వాతే..లోనికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఈ సమయంలో కరీనా వెంట భర్త సైఫ్ ఆలీఖాన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. ఇటీవలే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కూడా సెక్యూర్టీ ఆఫీసర్ అడ్డుకున్న సంగతి తెలిసేందే.

Read More : School Boys : బడికి వెళ్లే పిల్లల బ్యాంకు అకౌంట్లో రూ.900 కోట్లు.. ఎలా వచ్చాయంటే?

బుధవారం కరీనా..తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. భర్త సైఫ్ ఆలీఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్ లతో కలిసి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారామె. సైఫ్, తైమూర్ లు ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానాశ్రయంలోనికి వెళ్లారు. వీరి వెనుకాలే వస్తున్న కరీనా కపూర్, ఆమె సిబ్బందిని సీఐఎస్ఎఫ్ సెక్యూర్టీ అడ్డుకుంది. కేర్ టేకర్ ను పాస్ పోర్టు అడిగారు. కరీనాను సైతం అడిగారు.

Read More : Corona : భౌతిక దూరం 6 అడుగులు సరిపోదు..!

కరీనా..మేనేజర్ లు పాస్ పోర్టు ఇవ్వగా..దానిని సిబ్బంది చెక్ చేశారు. వెనుకాలే ఉన్న సిబ్బందిని సైతం పాస్ పోర్టు తదితర వివరాలు అడిగారు. అనంతరం పాస్ పోర్టును మేనేజర్ కు ఇచ్చేశారు కరీనా. అప్పటికే విమానాశ్రయంలోనికి వెళ్లిన సైఫ్..వెనక్కి వచ్చారు. కరీనా కోసం ఎదురు చూస్తు నిలబడ్డారు. అనంతరం వచ్చిన కరీనాతో ముచ్చటించారు. ఇక ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సెక్యూర్టీ ఆఫీసర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)