ఆదిపురుష్ లో లంకేశుడిగా సైఫ్ ఆలీఖాన్

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 08:28 AM IST
ఆదిపురుష్ లో లంకేశుడిగా సైఫ్ ఆలీఖాన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే ఆదిపురుష్ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్నట్లుగా..సైఫ్ ఆలీఖాన్ ప్రత్యర్థిగా నటించనున్నారని చిత్ర టీం వెల్లడించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, లంకేశుడిగా సైఫ్ కనిపించనున్నారని సినిమా టీం వెల్లడించింది.



టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. హిందీ, తెలుగు భాష‌ల్లో తెరకెక్క‌నున్న ఈ చిత్రాన్ని తమిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాదం చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించ‌నుండ‌టం విశేషం. భారీ బ‌డ్జెట్‌తో పొందిస్తున్నపౌరాణిక‌ చిత్ర‌మిది. రామాయ‌ణాన్నే ‘ఆదిపురుష్’ అని తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు వినిపి‌స్తున్నాయి.
https://10tv.in/prabhas-practicing-archery-at-home-adi-purush/
ప్రభాస్ హైట్, ఫిజిక్ రాముడిలా ఉంటాయి.. వ్యక్తిగతంగా కూడా తనలో రాముడి లక్షణాలున్నాయి అందుకే అతణ్ణి ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నామని ఓం రౌత్ అన్నారు. సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి రాముడిగా కనిపిస్తారు. మరి రావణాసురుడు, హనుమంతుడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది మరింత ఆసక్తిగా మారింది.



తాజాగా లంకేశ్వరుడి పాత్రలో సైఫ్ కనిపిస్తారని చెప్పడంతో ఇతరుల పాత్రలను ఎవరు పోషిస్తారనే దానిప చర్చ జరుగుతోంది. 2021లో షూటింగ్ స్టార్ట్ చేసి 2022లో విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా ఇంకా పూర్తి కానేలేదు.

మ‌రో వైపు నాగ్ అశ్విన్ లైన్‌లో ఉన్నాడు. ఈ రెండు చిత్రాల‌ను పూర్తి చేస్తే కానీ.. త‌న 22వ చిత్రాన్ని స్టార్ట్ చేయ‌లేడు. 2022 ద్వితీయార్థంలో లేదా 2023లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.