Mahesh Babu: మహేష్‌ను ఢీకొంటున్న బాలీవుడ్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అందుకేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ హీరో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu: మహేష్‌ను ఢీకొంటున్న బాలీవుడ్ హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అందుకేనా..?

Saif Ali Khan As Villain In Mahesh Babu Trivikram Movie

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

Trivikram Mahesh Babu Movie: అలా ఆ టీమ్‌ను మళ్లీ వాడుతున్న త్రివిక్రమ్..?

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ విలన్ పాత్ర కూడా ఉంటుందని.. అందులో నటించే నటుడికి మంచి గుర్తింపును తీసుకురావడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్‌ను నటింపజేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కాగా, ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంతో యావత్ ఇండియావైడ్‌గా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు ఈ యాక్టర్.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

ఇప్పుడు మహేష్ లాంటి హీరోను ఢీకొట్టే పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తే, ఈ సినిమాకు మరో మేజర్ బలంగా మారుతాడని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. అంతేగాక, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాక్టర్ బాగా ఉపయోగపడతాడని మేకర్స్ భావిస్తున్నారు. మరి నిజంగానే మహేష్‌ను ఢీకొట్టే పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తాడా.. లేక ఇది కేవలం పుకారుగానే మిగిలిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.