NTR30: తారక్ కోసం బరిలోకి దిగుతున్న బాలీవుడ్ విలన్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిర ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించబోతున్నట్లు తారక్ గతంలోనె వెల్లడించాడు. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

NTR30: తారక్ కోసం బరిలోకి దిగుతున్న బాలీవుడ్ విలన్..?

Saif Ali Khan To Act As Villain In NTR30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిర ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించబోతున్నట్లు తారక్ గతంలోనె వెల్లడించాడు. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

NTR30: తారక్ వేలిపై కొత్త బజ్.. ఎక్స్‌ట్రా ఉండటమే మంచిదట..?

అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంపై కొరటాల అండ్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ పవర్‌ఫుల్ బాలీవుడ్ యాక్టర్‌ను తీసుకొచ్చేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను ఈ సినిమాలో విలన్ పాత్రలో నటింపజేయాలని కొరటాల రెడీ అవుతున్నాడట.

NTR30: లొకేషన్ వేటలో NTR30 టీమ్.. ఎక్కడున్నారంటే?

ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్, స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటిస్తాడా లేడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా కోసం తారక్ మరోసారి తన లుక్‌ను మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది ఇంకా కన్ఫం కావాల్సి ఉంది.