Sailesh Kolanu : పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.. హిట్ 3 లోడింగ్.. ముగ్గురి హీరోలతో డైరెక్టర్ స్పెషల్ పోస్ట్..

హిట్ యూనివర్స్ గురించి గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు శైలేష్. ఏడు సినిమాల్లో ఏడుగురు హీరోలు ఉంటారని, చివరి సినిమాలో ఏడుగురు కనిపిస్తారని, ఆ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నామని చెప్పాడు. ప్రస్తుతం హిట్ 2 సక్సెస్ మూడ్ లో ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా................

Sailesh Kolanu : పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.. హిట్ 3 లోడింగ్.. ముగ్గురి హీరోలతో డైరెక్టర్ స్పెషల్ పోస్ట్..

Sailesh Kolanu special post with three heros

Sailesh Kolanu :  నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఆ సినిమాకి వరుసగా ఏడు సీక్వెల్స్ ఉన్నాయని, హిట్ యూనివర్స్ సృష్టించబోతున్నామని దర్శకుడు శైలేష్ కొలను గతంలోనే చెప్పాడు. ఇటీవల అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఇక హిట్ 2 సినిమా చివర్లోనే హిట్ 3లో నాని హీరోగా చేయబోతున్నాడు అంటూ నానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి వదిలేశాడు. ఇప్పటికే హిట్ యూనివర్స్ గురించి గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు శైలేష్. ఏడు సినిమాల్లో ఏడుగురు హీరోలు ఉంటారని, చివరి సినిమాలో ఏడుగురు కనిపిస్తారని, ఆ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నామని చెప్పాడు. ప్రస్తుతం హిట్ 2 సక్సెస్ మూడ్ లో ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు.

Adivi Sesh : సాహో తర్వాత సుజీత్‌కి బాలీవుడ్ ఆఫర్స్ చాలా వచ్చాయి.. కానీ..

హిట్ 1, 2, 3 హీరోలు విశ్వక్, అడివి శేష్, నానిలతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి.. హిట్ 3 మరింత పెద్దగా ఉండబోతుంది. హిట్ 3 మాములుగా ఉండదు. అదిరిపోతుంది అని పోస్ట్ చేశాడు. అలాగే హిట్ 2లో నాని చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఫోటోని షేర్ చేసి.. ”గుర్తుపెట్టుకోండి హిట్ 3 మాస్ ర్యాంపేజ్ గా ఉండబోతుంది. మీరు ఊహించని రేంజ్ లో ఉంటుంది” అని పోస్ట్ చేశాడు. హిట్ 3 వర్క్ కూడా మొదలవ్వకుండానే సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. మరి హిట్ 3 ఎలా ఉంటదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.