Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్ బాస్ కప్పు గెలవాలి : సజ్జనార్

ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక వీడియో ద్వారా శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్ లో అద్భుతంగా గేమ్ ఆడుతున్నడని, పాట‌లు కూడా బాగా పాడుతాడని, ఈ సారి ఆయ‌నే క‌ప్ గెలుస్తాడ‌నే న‌మ్మకం ఉంద‌ని

Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్ బాస్ కప్పు గెలవాలి : సజ్జనార్

Sajjanar

Bigg Boss 5 :  బిగ్ బాస్ ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకొని పదవ వారం నడుస్తోంది. ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ వారం అనారోగ్యం కారణంగా జెస్సి వెళ్లిపోవడంతో నామినేషన్స్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్లల్లో ఒకరిద్దరు నెక్స్ట్ వీక్ లోనే వెళ్ళిపోతారని తెలిసిపోతుంది. కొంతమంది కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. బయట నుంచి సపోర్ట్ బాగుండటంతో నామినేట్ అయినా సేఫ్ అవుతున్నారు.

Nikhil : 18వ తారీఖు సుకుమార్ రాసిన ’18 పేజీలు’

మిగిలిన కంటెస్టెంట్స్ లో టాప్ 3లో రవి, షన్ను, శ్రీరామ్ ఉన్నారు. రవికి ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు నాగార్జున సపోర్ట్ కూడా ఉంది. ఇక షన్నుకి ఫ్యాన్స్ సపోర్ట్ చాలా బాగుంది. శ్రీరామ్ కి మాత్రం సెలబ్రిటీలంతా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సింగర్ శ్రీరామచంద్రకు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Bigg Boss 5 : నిన్న దీప్తి.. ఇవాళ జ్యోతి.. సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్

ఇటీవల హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ ఉంద‌ని పోస్ట్ చేసింది. శ్రీరామ్ కి వోట్ వేయమని తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కమెడియన్ భారతీ సింగ్ కూడా శ్రీరామ చంద్ర తనకు స్నేహితుడు తనను గెలిపించండి అంటూ వీడియో షేర్ చేసింది. ఆ తర్వాత అందరికి హెల్ప్ చేసే సోనూసూద్ కూడా సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు.

RRR : సినిమా టికెట్ ధరలపై ఏపీ సీఎంని కలవనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

తాజాగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక వీడియో ద్వారా శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్ లో అద్భుతంగా గేమ్ ఆడుతున్నడని, పాట‌లు కూడా బాగా పాడుతాడని, ఈ సారి ఆయ‌నే క‌ప్ గెలుస్తాడ‌నే న‌మ్మకం ఉంద‌ని అన్నారు. ఈ వీడియోని శ్రీరామ చంద్ర ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఇక శ్రీరామ్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. సజ్జనార్ కి జనాల్లోమంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ తో శ్రీరామ్ కి కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది.