Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్! | Prabhas

Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్!

‘సలార్’ సినిమాకి పాన్ ఇండియన్ స్టార్‌ ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?..

Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్!

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, ‘బాహుబలి’ తో తెలుగు సినిమా దశ, దిశను మార్చేసి, ‘సాహో’ తో సత్తా చాటారు పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్నారు.

Krishnam Raju : హ్యాపీ బర్త్‌డే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు..

‘కె.జి.యఫ్’ డైరెక్టర్, పాన్ ఇండియా స్టార్ కలిసి చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. ‘సలార్’ షూటింగ్ స్టార్ట్ అయ్యాక బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’ కమిట్ అయ్యి ఇటీవలే తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు డార్లింగ్. తర్వాత ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘Project-K’ మొదలెట్టారు.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

సందీప్ రెడ్డి వంగాతో ఏకంగా ఎనిమిది భాషల్లో ‘స్పిరిట్’ అనౌన్స్ చేశారు. ప్రభాస్ 25వ సినిమా ఇది. ‘సలార్’ సినిమా కోసం డార్లింగ్ రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్‌గా ఎలాంటి న్యూస్ రాలేదు.

SALAAR : పిచ్చెక్కించేలా ప్రీ-క్లైమాక్.. బడ్జెట్ ఎంతో తెలుసా!

కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’ కి ఎంత తీసుకుంటున్నారో వివరాలు తెలిసాయి. అక్షరాలా వంద కోట్ల రూపాయల పారితోషికం.. దాంతో పాటు పది శాతం థియేట్రికల్ షేర్ తీసుకుంటున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

×