Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు....

Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్

Salaar Completing 3 Action Sequences

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో చిత్ర యూనిట్ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ ఇక్కడే ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ చూపిస్తున్నాడట. ఈ షెడ్యూల్‌లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాడట ఈ డైరెక్టర్.

Salaar: వైలెన్స్.. వైలెన్స్.. సలార్‌లో కేజీఎఫ్‌ను మించి యాక్షన్!

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ‘సలార్’లో ప్రభాస్ ఎలా రెచ్చిపోతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా చాలా రఫ్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.