Salaar: సలార్ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్..?

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేజీయఫ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Salaar: సలార్ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్..?

Salaar Last Schedule Shooting Update Enthralls Fans

Salaar: పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేజీయఫ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Salaar: ‘సలార్’పై ఆ నెలలో నిర్ణయం తీసుకుంటారా..?

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ను జనవరి 8 నుంచి స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. ఇక ఈ షెడ్యూల్ చివరిది కావడంతో, ఇది కాస్త లెంగ్తీగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ ఎపిసోడ్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Salaar : సలార్ సెట్‌లో బర్త్ డే సెలెబ్రేషన్స్.. శరవేగంగా సలార్ షూటింగ్.. ఫ్యాన్స్ ఖుషి..

ఈ షెడ్యూల్ తరువాత ప్రభాస్ ఫ్రీ అయిపోతాడు. దీంతో ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.