Salaar : ప్రభాస్ ఇంట్రడక్షన్ డైలాగ్ అదిరిందిగా..

రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ ఇంట్రడక్షన్ లీక్డ్ డైలాగ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Salaar : ప్రభాస్ ఇంట్రడక్షన్ డైలాగ్ అదిరిందిగా..

Salaar Leaked Dialogue

Salaar: మన టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫిలిం ‘సలార్’. శృతి హాసన్ కథానాయిక.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..

ఈశ్వరీ రావు, జగపతి బాబు, మధు గురు స్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ పూర్తయింది. 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఇటీవల ‘సలార్’ యాక్షన్ సీన్స్‌కి సంబంధించి కొన్ని పిక్స్ నెట్టింట హల్ చల్ చేసాయి.

Prabhas : సింహం.. తిమింగలం.. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్స్ అదుర్స్..

రీసెంట్‌గా ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌లో చెప్పే డైలాగ్ ఇదేనంటూ ఓ సాలిడ్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నా మీసం తిప్పే లోపు మీ బండ్లు వెనక్కి తిప్పి వెళ్లిపోండి.. లేదంటే తిరగడానికి బండ్లున్నా తిప్పడానికి మీరుండరు’.. డైలాగ్ అయితే అదిరింది కానీ ఇది సినిమాలో ఉంటుందా లేక నెటిజన్లు ఎవరైనా కావాలనే క్రియేట్ చేశారా అనేది మాత్రం క్లారిటీ లేదు.

Prabhas : బర్త్‌డే సర్‌ప్రైజెస్ వచ్చేస్తున్నాయ్ డార్లింగ్స్..