Salaar: రెండు పార్టులుగా సలార్.. నిజమెంత?

ఇండియన్ సినీ పరిశ్రమతో పాటు సినీ ప్రేక్షకులలో మాంచి బజ్ నెలకొన్న సినిమాలలో ప్రభాస్ సలార్ ఒకటి. కేజీఎఫ్ క్రేజీతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకవైపు కేజేఎఫ్ 2 తెరకెక్కిస్తూనే మరోవైపు ప్రభాస్ సలార్ ను కూడా సిద్ధంచేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Salaar: రెండు పార్టులుగా సలార్.. నిజమెంత?

Salaar

Salaar: ఇండియన్ సినీ పరిశ్రమతో పాటు సినీ ప్రేక్షకులలో మాంచి బజ్ నెలకొన్న సినిమాలలో ప్రభాస్ సలార్ ఒకటి. కేజీఎఫ్ క్రేజీతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకవైపు కేజేఎఫ్ 2 తెరకెక్కిస్తూనే మరోవైపు ప్రభాస్ సలార్ ను కూడా సిద్ధంచేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఈ సినిమా మీద రోజుకో వార్త తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలాఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుందట. కేజేఎఫ్ మాదిరిగానే రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ ప్రభాస్ ముందు ప్రపోజల్ పెట్టాడని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని ఆ వార్త సారాంశం. అయితే ప్రభాస్ నుంచి ఇప్పటికి ఇంకా దీనిపై ఎలాంటి స్పందనలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం ప్రచారం మాత్రమే కాగా మేకర్స్ చర్చల అనంతరం మాత్రమే దీనిపై క్లారిటీ రానుంది.

కాగా.. ఇప్పటికే ప్రభాస్ రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలిలో నటించగా దర్శకుడు ప్రశాంత్ కూడా కేజీఎఫ్ రెండో భాగం సిద్ధమవుతోంది. మరోవైపు రెండు పార్టులుగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి హైప్ పెంచడం ఇప్పుడు నడుస్తున్న జమానా. ఈ కారణంగానే సలార్ రెండు పార్టులపై ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే స్క్రిప్ట్ డెవలప్మెంట్, బడ్జెట్, కాల్ షీట్స్ ఇలా అన్నీ పొడగించుకోవాల్సిందే. మరి ఇదంతా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాల్సి ఉంది.