Salaar: సలార్ టీజర్ ఇప్పట్లో రానట్టేనా.. ప్రేక్షకుల ఎదురుచూపులు ఇంకెన్ని రోజులు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Salaar: సలార్ టీజర్ ఇప్పట్లో రానట్టేనా.. ప్రేక్షకుల ఎదురుచూపులు ఇంకెన్ని రోజులు..?

Salaar Teaser Update To Take More Time

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Salaar: ‘సలార్’ ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ ఉందంటే..?

అయితే ఈ సినిమా నుండి టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది మే నెలలో ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పినా, టీజర్‌ను మాత్రం వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈఏడాది మే నెల కూడా దగ్గరకు వస్తుంది. దీంతో కేవలం టీజర్ రిలీజ్‌కే ఏడాది పడితే, సినిమా పరిస్థితి ఏమిటని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Salaar: ‘సలార్’పై ఆ నెలలో నిర్ణయం తీసుకుంటారా..?

మరి నిజంగానే అభిమానులు మరింత కాలం ఎదురుచూసేలా సలార్ చిత్ర యూనిట్ చేస్తోందా.. లేక ఈ టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తారా అనే విషయంపై మాత్రం సలార్ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంగడా, ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హొంబాలే ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోండగా, సెప్టెంబర్ 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.