సలార్ ప్రారంభం, ప్రభాస్, యశ్ ఫొటోలు వైరల్

సలార్ ప్రారంభం, ప్రభాస్, యశ్ ఫొటోలు వైరల్

salar shooting start : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీయఫ్ హీరో యష్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ లాంఛనంగా 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేజీయఫ్ హీరో యష్ కూడా హాజరయ్యారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ షూటింగ్ పూర్తయ్యింది. కేజీయఫ్ ఛాప్టర్ 1తో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ క్రేజ్ దక్కించుకున్నారు. కేజీయఫ్ ఛాప్టర్ 2ను భారీ అంచనాలతో రూపొందిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే..ప్రశాంత్ నీల్..ప్రభాస్ తో సలార్ మూవీని ప్రారంభించారు. సలార్ సినిమా కోసం ప్రభాస్ నాలుగు నెలల టైం కేటాయించినట్లు సమాచారం. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని టాక్. సోషల్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సామాన్యుల హక్కుల కోసం పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి.

ప్రభాస్..జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యాం’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ తరహాలో ఈ ఫిల్మ్ రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ నిర్మిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే..ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్. రాముడిగా కనిపించనున్నారు ప్రభాస్. ఆ తర్వాత..వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను కూడా పట్టాలెక్కిస్తారని సమాచారం.