ఈగ విలన్‌కు సల్లూ భాయ్ ఖరీదైన గిఫ్ట్ 

  • Published By: madhu ,Published On : January 8, 2020 / 10:46 AM IST
ఈగ విలన్‌కు సల్లూ భాయ్ ఖరీదైన గిఫ్ట్ 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకు నచ్చిన మిత్రులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుంటాడు. కార్లను ఎక్కువగా బహుకరిస్తుంటాడు. కార్లు, ఇతర వస్తువుల అందుకున్న వారు చాలా మందే ఉంటారు. ఈ జాబితాలో ఈగ విలన్ సుదీప్ చేరిపోయాడు. ఆయనకు కూడా సల్మాన్ గిఫ్ట్ ఇచ్చాడు. స్వయంగా సుదీప్ ఇంటికి వెళ్లి మరి ఈ గిప్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర్ అవుతున్నాయి. 

సుదీప్‌ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేసి, ఖరీదైన కారును ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భాయ్‌కు ధన్యవాదాలు చెప్పారు. మీరు మంచి చేస్తే మీకూ మంచే జరుగుతుందనేది సల్మాన్‌ సార్‌ నిజం చేశారని.. మా ఇంటికి ఆయనతో పాటు BMW M 5ను తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ చేశారని సుదీప్‌ ట్వీట్‌ చేశారు. సల్మాన్‌తో కలిసి దబాంగ్‌ 3 లో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే సల్మాన్‌.. సుదీప్‌కు ఓ జాకెట్‌ను కానుకగా ఇచ్చారు. తనకు ఇష్టమైన కుక్క ఫొటోను జాకెట్‌పై డిజైన్‌ చేయించి మరీ ఇచ్చారు. ఈ విషయాన్ని సుదీప్‌ ఇటీవల తెలిపారు. ఇప్పుడు ఖరీదైన కారును కానుకగా అందజేశారు.

 

Read More : సంక్రాంతి పండుగ : వణికిపోతున్న ప్రైవేటు ట్రావెల్స్
దబాంగ్ సిరీస్‌లో మూడో సినిమా దబాంగ్ 3. సల్మాన్ హీరోగా..సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. సౌత్ స్టార్ హీరో, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదల కలెక్షన్ల సునామీ సృష్టించింది. సల్మాన్ 54వ పుట్టిన రోజునే దబాంగ్ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. సల్మాన్ నటించిన 15 సినిమాలు వంద కోట్ల క్లబ‌లో చేరడం విశేషం. టాక్‌తో సంబంధం లేకుండా..అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో అదరగొట్టాయి. భజ్ రంగీ భాయ్ జాన్, సుల్తాన్, కిక్, భారత్, ప్రేమ్ రతన్ పాయో, ఏక్ థా టైగర్, రేస్ 3, దబాంగ్ 2. బాడీగార్డ్, రెడీ, ట్యూబ్ లైట్, జైహో, దబాంగ్ 3 ఇలా కొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి.