Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

సల్మాన్ ఖాన్.. కెరీర్ లో సోలోగా సినిమాలు చేస్తూనే ప్యార్లల్ గా మల్టీస్టారర్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఎప్పటినుంచో మల్టీస్టారర్స్ చేస్తున్న భాయ్ జాన్.. ఈమధ్య బ్యాక్ టూ బ్యాక్..

Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

Salman Khan: సల్మాన్ ఖాన్.. కెరీర్ లో సోలోగా సినిమాలు చేస్తూనే ప్యార్లల్ గా మల్టీస్టారర్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఎప్పటినుంచో మల్టీస్టారర్స్ చేస్తున్న భాయ్ జాన్.. ఈమధ్య బ్యాక్ టూ బ్యాక్ మల్టీస్టారర్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. అంతేకాదు, మల్టీస్టారర్ గా బాప్ అనిపించుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఈమధ్య తన సినిమాలతో పాటు మల్టీస్టారర్ మూవీస్ తో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అంతకుముందు నుంచి కూడా మల్టీస్టారర్స్ చేస్తున్నా కూడా ఈమధ్య మరీ ఎక్కువగా వేరే హీరోల సినిమాల్లో కనిపిస్తున్నారు సల్మాన్ భాయ్.

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

మొన్నీమధ్య దీపావళికి తన బావ ఆయుష్ తో అన్తిమ్ సినిమాలో కనిపించిన సల్మాన్ ఖాన్.. మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కి రెడీ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రజెంట్ టైగర్ 3 సినిమాతో బిజీగా ఉన్నారు. అంతేకాదు.. షారూఖ్ ఖాన్ చేస్తున్న పఠాన్ మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. టైగర్ నెక్ట్స్ ఇయర్ డిసెంబర్ లో రాబోతోందని, అంతకుముందే షారూఖ్ పఠాన్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు సల్మాన్. అంతేకాదు.. షారూఖ్ సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ చేసే సల్మాన్.. ఈసారి ఇద్దరి కాంబినేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా కూడా రాబోతోందని హింట్ ఇచ్చారు.

Salman Khan: ఆటో నడిపిన సల్మాన్.. ఇన్సూరెన్స్ చేశారా అని ట్రోలింగ్!

బాలీవుడ్ లో మల్టీస్టారర్లతో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. తెలుగులో మరో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్నారు. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు సల్మాన్ ఖాన్. తెలుగులో.. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, చరణ్ తో మంచి టచ్ ఉన్న సల్మాన్ ఖాన్ ని.. గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు సినిమాకి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.