Salman Khan: సల్లు భాయ్ ఫ్యామిలీ కష్టాలు.. జీతం పెంచాలని విన్నపాలు!

సల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. రెండేళ్లనుంచి సరిగా సినిమాలు రిలీజ్ అవ్వక.. అయ్యినా కలెక్షన్లు లేక.. అస్సలు డబ్బులు సరిపోవట్లేదట. అటు స్మాల్ స్క్రీన్ తో పాటు..

Salman Khan: సల్లు భాయ్ ఫ్యామిలీ కష్టాలు.. జీతం పెంచాలని విన్నపాలు!

Salman Khan

Salman Khan: సల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. రెండేళ్లనుంచి సరిగా సినిమాలు రిలీజ్ అవ్వక.. అయ్యినా కలెక్షన్లు లేక.. అస్సలు డబ్బులు సరిపోవట్లేదట. అటు స్మాల్ స్క్రీన్ తో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తూ.. బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. శాలరీ పెంచమని అడుగుతున్నారు.

Allu Arjun: పుష్పకి బ్రేక్ ఇచ్చేసి దుబాయ్ చెక్కేసిన బన్నీ!

ఏ సినిమా అయినా మినిమం 100కోట్లు కలెక్ట్ చేసే స్టామినా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయట. డబ్బులు సరిపోవట్లేదట. 55 ఏళ్లైనా పెళ్లి చేసుకోకుండా స్టిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ తో ఉన్న ఈ స్టార్ హీరోకి శాలరీ పెంచాలట. అసలు డబ్బులు సరిపోవట్లేదు నా జీతం పెంచండి అంటూ అడుగుతున్నారు సల్మాన్ ఖాన్.

Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా తనకు శాలరీ సరిపోవడం లేదని, ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని, దయ చేసి శాలరీ విషయంలో కాస్త పెంచాలని సరదాగా బిగ్ బాస్ షో మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్ తో సరికొత్త థీమ్ తో త్వరలో స్టార్టవుతున్నబిగ్ బాస్ 15 షోకి సల్మాన్ ఖాన్ 14 వారాలకి దాదాపు 350 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు.

Salman Khan : రవితేజని ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్..

దాదాపు 10 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో ని హోస్ట్ చేస్తున్నారు. తన లైఫ్ లో తనతో పాటు రిలేషన్ లో ఉన్న లాంగెస్ట్ పార్టనర్ బిగ్ బాసే అన్నారు సల్మాన్ ఖాన్. టైగర్ 3 షూట్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్.. ఇటు బిగ్ బాస్ ప్రమోషన్స్ తో కూడా ఎంగేజ్ అయిపోతున్నారు. ఒక వైపు స్మాల్ స్క్రీన్ ని ఎంటర్ టైన్ చేస్తూనే మరో వైపు అన్తిమ్, టైగర్ 3 సినిమాల్ని లైన్లోపెట్టారు సల్మాన్ ఖాన్.