భాయ్‌జాన్ బడా దిల్- 25 వేల మందికి సాయం..

కరోనా ఎఫెక్ట్ : సినిమా పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సల్మాన్ ఖాన్ సాయం..

  • Published By: sekhar ,Published On : March 29, 2020 / 02:49 PM IST
భాయ్‌జాన్ బడా దిల్- 25 వేల మందికి సాయం..

కరోనా ఎఫెక్ట్ : సినిమా పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సల్మాన్ ఖాన్ సాయం..

కరోనా మహమ్మారి రోజురోజుకీ విలయ తాండవం చేస్తోంది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో పనిచేసే వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు.

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే క‌ళాకారుల దగ్గరినుంచి రోజువారి వేతనానికి పనిచేసే వారి ప‌రిస్థితి కూడా ద‌య‌నీయంగా మారింది. అలాంటి వారికి స‌హాయం అందించేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని ఎఫ్‌డ‌బ్ల్యూఐసిఈ (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) అధికార ప్ర‌తినిధి బీఎన్ తివారీ కోరిన నేపథ్యంలో భాయ్‌జాన్ ముందుకొచ్చాడు.

తనవంతుగా 25 వేల మందికి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధ‌మయ్యాడు. ఈ మేరకు స‌ల్మాన్ త‌న‌ బీయింగ్ హ్యూమ‌న్‌ ఫౌండేష‌న్ ద్వారా 25 వేల మంది రోజువారి వేతనానికి పనిచేసే కళాకారులకు ఆర్థిక సాయం అందంచడానికి ముందుకొచ్చారని, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకే నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారని తివారీ తెలియజేశారు. సల్మాన్‌తో పాటు కరణ్ జోహర్, తాప్సీ తదితరులు తమవంతు సాయమందించడానికి ముందుకొచ్చారు.