Snake Bites Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేసింది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది.

Snake Bites Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము

Snake Bites Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేసింది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది.

సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఖాన్‌పై పెద్దగా ప్రభావం లేదని చెప్పారు. పాము కాటు తర్వాత, సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరాడు.

చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఈరోజు ఉదయం 9 గంటలకు తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. సల్మాన్‌ఖాన్‌ పరిస్థితిని పర్యవేక్షించడానికి రాత్రంతా డాక్టర్లు ఆస్పత్రిలో ఉంచుకున్నారు. ఉదయం డిశ్చార్జ్ చేసి విశ్రాంతి తీసుకోనున్నారు. సల్మాన్ ఖాన్ పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు.

డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలు, పుట్టినరోజు జరుపుకునేందుకు సల్మాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఈ ప్రాంతం చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉంది.