నిజం ఇదే…గాన కోకిలకు సల్మాన్ 55లక్షల ఇల్లు గిఫ్ట్?

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2019 / 12:58 PM IST
నిజం ఇదే…గాన కోకిలకు సల్మాన్ 55లక్షల ఇల్లు గిఫ్ట్?

రేణు మొండల్.. ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. రన్నింగ్ ట్రైన్‌లో పాడిన పాటే తన లైఫ్ రన్‌కి ఉపయోగపడుతుందని, తన తలరాతను మార్చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు.  పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు రేణు పాట విని ప్రశంసిస్తున్నారు.

ఆమె వాయిస్‌కు ఫిదా అయిన హిమేష్ రేష్మియా తను రూపొందిస్తున్న తేరీ మేరీ కహానీ ఆల్బమ్‌లో ఆమెతో పాట పాడించిన సంగతి తెలిసిందే. త్వరలో తన సినిమాలోనూ ఆమెతో పాడిస్తానని మాటిచ్చాడు. ఇదిలా ఉంటే రేణు గాత్రానికి ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఆమెకు రూ.55 లక్షలు విలువ చేసే ఓ ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడనే వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అయితే సల్మాన్ ఆమెకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడన్నది ఫేక్ న్యూస్ అని రేణు మొండల్ పాట పాడుతున్న వీడియోను మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసిన అతింధ్ర చక్రవర్తి తెలిపారు. రేణు మొండల్ కు ఓ ఆధార్ కార్డ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకు ఆమె నివసించిన చోటే ఆమెకు స్థానిక యంత్రాంగం ఓ ఇల్లు కట్టిస్తోందని అతింధ్ర తెలిపాడు.