Salman Khan : భార్య, కూతుర్ని ఎక్కడ దాచావ్..? తమ్ముడి ప్రశ్నకు షాక్ అయిన సల్లూ భాయ్..

తన షో కు గెస్ట్‌గా వచ్చిన అన్నయ్యను హోస్ట్‌గా ఇదే ప్రశ్న అడిగాడు అర్బాజ్ ఖాన్..

Salman Khan : భార్య, కూతుర్ని ఎక్కడ దాచావ్..? తమ్ముడి ప్రశ్నకు షాక్ అయిన సల్లూ భాయ్..

Salman Khan Arbaaz Khan

Salman Khan: ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌, తమ్ముడు అర్బాజ్ ఖాన్ అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యాడు. 50 ప్లస్ ఏజ్‌లోనూ ఫిట్‌గా కనిపించే భాయ్ జాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు కానీ ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారంటూ అర్బాజ్ అనడంతో అన్నయ్య షాక్ అయ్యాడు.

అసలేం జరిగిందంటే.. సల్లూ భాయ్ తనకు పెళ్లి అయిందనే విషయాన్ని బయటకు చెప్పలేని పిరికివాడు. తన భార్య నూర్‌తో పాటు 17  ఏళ్ల కూతురుని దుబాయ్‌లో రహస్యంగా దాచిపెట్టాడు అంటూ గతంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం నిజమేనా అంటూ అన్నను అడిగాడు అర్బాజ్.

Pinch 2 Show

బాలీవుడ్‌లో అర్బాజ్ ఖాన్ ‘పించ్’ అనే షో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ నడుస్తోంది. సోషల్ మీడియాలో తమ మీద వచ్చిన కామెంట్స్ గురించి సెలబ్రిటీలు సమాధానం చెప్పడం ఈ షో మెయిన్ థీమ్. ఇందులో భాగంగానే తన షో కు గెస్ట్‌గా వచ్చిన అన్నయ్యను హోస్ట్‌గా ఇదే ప్రశ్న అడిగాడు అర్బాజ్ ఖాన్.

దీంతో షాక్ అయిన సల్మాన్.. ‘ఈ ప్రశ్న అడుగుతుంది నన్నేనా’..? అని అడగ్గా అర్బాజ్ ‘అవును’ అని చెప్పాడు. ‘ఇదంతా ఫేక్.. వాళ్లెవరి గురించి అన్నారో తెలియదు.. నాకు భార్య, కూతురు ఎవరూ లేరు. నేను నా చిన్నతనం నుండి ఇండియాలో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు సల్మాన్ ఖాన్.