Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..

దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ అంటే సల్మాన్ ఖాన్‌కు చాలా ఇష్టం. గతంలో దేవి కంపోజ్ చేసిన చాలా ట్రాక్స్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లారు. ఆర్య 2లోని రింగా రింగా, అలాగే డీజేలోని సీటీమార్ మ్యూజిక్.............

Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..

Salman Khan

Devisri Prasad :  టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి అందరికి తెలిసిందే. ఎన్నో మెలోడీ, ఎన్నో ఐటెం సాంగ్స్, మాస్ సాంగ్స్ తో జనాల్ని మెప్పించాడు.కానీ గత కొన్ని ఏళ్లుగా దేవి అంత ఫామ్ లో లేడని తెలిసిందే. ఒకప్పుడు దేవి చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ అయ్యేది. ఇప్పుడు ఏదో ఒక ఆల్బమ్ హిట్ అవుతుంది. దేవిశ్రీ తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, బాలీవుడ్ సినిమాలకి కూడా మ్యూజిక్ అందించాడు.

దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ అంటే సల్మాన్ ఖాన్‌కు చాలా ఇష్టం. గతంలో దేవి కంపోజ్ చేసిన చాలా ట్రాక్స్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లారు. ఆర్య 2లోని రింగా రింగా, అలాగే డీజేలోని సీటీమార్ మ్యూజిక్.. ఇలా పలు ట్రాక్స్ ని బాలీవుడ్ లో వాడేసుకున్నారు. దీంతో దేవి మ్యూజిక్ నచ్చి సల్మాన్ తన రాబోయే సినిమా కభీ ఈద్ కభీ దివాళీకి దేవిశ్రీ ప్రసాద్ కి ఛాన్స్ ఇచ్చాడు. కభీ ఈద్ కభీ దివాళీ సినిమా అంతా హైదరాబాద్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ ముఖ్యపాత్రలో, రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ లో కనపడబోతున్నారు. అయితే తాజాగా దేవిశ్రీని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు సమాచారం.

Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??

దేవిశ్రీ ప్రసాద్ కభీ ఈద్ కభీ దివాళీ సినిమా కోసం కంపోజ్ చేసిన ట్రాక్స్ సల్మాన్ ఖాన్ కి నచ్చలేదంట. దీంతో దేవికి సున్నితంగా నో చెప్పేసి ఆ అవకాశం కేజీయఫ్‌ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌కు ఇచ్చాడట. సల్మాన్ అడగడంతో రవిబస్రూర్ వెంటనే ఓకే చెప్పేశాడట. అంతే కాక ఇప్పటికే కభీ ఈద్ కభీ దివాళి టైటిల్ మ్యూజిక్ ని కూడా కంపోజ్ చేసి ఇవ్వగా అది సల్మాన్ కి నచ్చింది. దీంతో ఈ సినిమాకి రవి బస్రూర్‌ ఫిక్స్ అయిపోయాడు.