Salman Khan : కత్రినాకైఫ్ వివాహంపై స్పందించిన సల్మాన్.. మీ వివాహంతో అందరూ…

తాజాగా కత్రినా వివాహంపై సల్మాన్ స్పందించాడు. ఆదివారం జరిగిన హిందీ బిగ్​బాస్​ సీజన్​ 15 ఫినాలేలో సల్మాన్ కత్రినా వివాహంపై స్పందించాడు. కత్రీనా కైఫ్ సాంగ్ చికినీ చమేలి పాటకు.........

Salman Khan : కత్రినాకైఫ్ వివాహంపై స్పందించిన సల్మాన్.. మీ వివాహంతో అందరూ…

Salman Khan

Salman Khan :  ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ వివాహం బాలీవుడ్ యువ హీరో విక్కీకౌశల్ తో జరిగిన సంగతి తెలిసిందే. ఆమె వివాహంపై అన్ని సినీ పరిశ్రమల వారు విషెష్ తెలిపారు. గతంలో కత్రినా బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్ తో రిలేషన్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో చాలా మంది అభిమానులు కత్రినా వివాహంపై సల్మాన్ స్పందిస్తాడా అని ఎదురు చూశారు. తాజాగా కత్రినా వివాహంపై సల్మాన్ స్పందించాడు.

 

ఆదివారం జరిగిన హిందీ బిగ్​బాస్​ సీజన్​ 15 ఫినాలేలో సల్మాన్ కత్రినా వివాహంపై స్పందించాడు. ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు సెలబ్రిటీలు వచ్చి బిగ్​బాస్​ స్టేజిపై సందడి చేశారు. ఇందులో భాగంగా కత్రీనా కైఫ్ సాంగ్ చికినీ చమేలి పాటకు రాఖీ సావంత్​, రుబీనా దిలాయక్​ డ్యాన్స్​ చేశారు. దీంతో ఈ పాట అయ్యాక సల్మాన్ సాంగ్ గురించి, కత్రినా గురించి మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ కత్రీనా.. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ వివాహంతో అందరూ సంతోషిస్తున్నారు.’ అని అన్నారు.

30 weds 21 : ’30 వెడ్స్​ 21′ సీజన్ 2.. మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా??

దీంతో కత్రీనా కైఫ్​ విషయంపై షెహనాజ్​ గిల్ సరదాగా సల్మాన్ ని టీజ్​ చేసింది. ​సల్మాన్​ అలా చెప్పగానే ‘మీరు కూడా సంతోషంగా ఉన్నారా? అయినా మీరు సింగిల్​గా ఉంటేనే బాగుంటారు’ అని అనడంతో ‘అవును. నేను సింగిల్​గా ఉన్నప్పుడే మరింత బాగుంటాను’ సల్లూ భాయ్​ తెలిపాడు. దీంతో షెహనాజ్​ ‘ఇప్పుడు మీరు కమిటెడ్ ఆ?’ అని అడగ్గా సల్మాన్​ సమాధానం ఇవ్వకుండా నవ్వేశాడు.